‘రేసు గుర్రం’కి ఫ్యాన్సీ ఆఫర్స్

race-gurram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఇంకా రిలీజ్ కి మూడు వారాలు ఉండగా అప్పుడే ఈ సినిమాకి బిజినెస్ పరంగా ఫ్యాన్సీ రేట్స్ కి అమ్ముడుపోతోంది. ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ పరంగా ఈ చిత్ర నిర్మాత నల్లమలపు బుజ్జి చాలా హ్యాపీగా ఉన్నాడని తాజా సమాచారం.

ఈ మూవీలో హై రేంజ్ లో కామెడీ ఉంటుందని సమాచారం, అలాగే బ్రహ్మానందం పాత్ర సినిమాకే పెద్ద హైలైట్ అవుతుందని ఆశిస్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో కూడా ఈ మూవీకి కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని భావిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిక్ శ్యామ్, సలోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ మ్యూజిక్ ఆల్బం ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Exit mobile version