స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ రోజు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను హైదరాబాద్ శివార్లలో షూట్ చేయనున్నారు.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్లమలపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాత.