ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న రేసు గుర్రం

ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న రేసు గుర్రం

Published on Dec 10, 2013 8:00 AM IST

Race_Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ ని చాలా మంది వీక్షించారు. అలాగే పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మనం ఊహించని మలుపులు చాలా ఉంటాయని అంటున్నారు.

అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డికూడా ఈ సినిమాలో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సరసన్ శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా కనిపించనున్నారు. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు