16న ‘రేసుగుర్రం’యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

16న ‘రేసుగుర్రం’యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Published on Nov 12, 2013 5:30 PM IST

Allu-Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేసుగుర్రం’. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలని ఈ సినిమా నిర్వాహకులు బావిస్తున్నారు. ఈ సినిమాకు సంబధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఈ నెల 16న చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమా లో కొన్ని కొత్త, ఇంటరెస్టింగ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో చిత్రీకరించిన ఆ యాక్షన్ సన్నివేశాలను చూడాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు