తన డైట్ పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్ !

తన డైట్ పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్ !

Published on Oct 6, 2025 7:58 AM IST

Rashi khhana

గ్లామర్ హీరోయిన్‌ రాశిఖన్నా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ముఖ్యంగా తాను గతంలో లావు ఉండేదాన్ని అని ఆమె తెలిపింది. ఈ విషయం గురించి రాశిఖన్నా ఇంకా మాట్లాడుతూ.. ‘చిన్నప్పట్నుంచి నాకు ఫుడ్ అంటే ఇష్టం. పరాఠా, మఖాన్ బాగా తినేదాన్ని. అందుకే లావుగా ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్‌పై అందంగా కనిపించాలి. మొదట్లో నాకు ఇది అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది’ అని రాశి ఖన్నా తెలిపింది.

రాశి ఖన్నా ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు నేనే లావుగా కనిపించాను. తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మెల్లగా తగ్గాలనుకున్నాను. జిమ్‌ కు వెళ్లడం ప్రారంభించాను. ఇప్పుడు నా జీవితంలో జిమ్ ఓ భాగమైపోయింది. ఐతే, స్లిమ్‌ గా మారే క్రమంలో నేను డైట్ మార్చలేదు. చిన్నప్పట్నుంచి ఏవి తింటున్నానో, వాటినే ఇప్పుడు కూడా తింటున్నానని, కానీ అన్నీ కొంచెం కొంచెం తింటున్నానని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు