సందీప్ కిషన్, రెజీనా నటిస్తున్న రారా కృష్ణయ్య సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్, మరియు రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే హీరో, హీరోయిన్లపై ఒక పాటను హైదరాబాద్లో చిత్రీకరించారు. అది రూపొందిన విధానంపై సందీప్ కిషన్ ఆనందంగా వున్నాడు
త్వరలో ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు పి తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్నాడు. వంశీ కృష్ణ శ్రీనివాస్ ఎస్.వి.కె సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఆడియోను మార్చ్ లోనే మనముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జగపతిబాబు క్యారక్టర్ సినిమాకే ప్రధానాకర్షణగా నిలవనుందని సమాచారం. సినిమా వేసవిలో మనముందుకు తీసుకురానున్నారు