ఆర్ ఆర్ మూవీ మేకర్స్ త్రిభాషా చిత్రం

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ త్రిభాషా చిత్రం

Published on May 13, 2012 5:24 PM IST


కిక్,బిజినెస్ మాన్ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఇప్పుడు ఒక త్రిభాషా చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రానికి ” లవ్ లాంగ్వేజ్” అని పేరు పెట్టారు. ఈ చిత్రం తెలుగు,తమిళ్ మరియు హిందీలలో విడుదల కానుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా ఎల్ వాసు దేవ పరిచయం కాబోతున్నారు. ” కొద్ది రోజుల క్రితం మేము కొత్తవారిని ప్రోత్సహించడానికి చిత్రాలను తీస్తము అని ప్రకటించాము ఆ ప్రకటనకు అపారమయిన స్పందాహన లభించింది. అందులో ఎల్ వాసు దేవ “లవ్ లాంగ్వేజ్” మమ్మల్ని ఆకర్షించింది. చిత్ర బృందం మొత్తం కొత్తవారిని తీసుకుంటున్నాం ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ కానుంది అని అనుకుంటున్నాం” అని డా. వెంకట్ చెప్పారు. ఈ చిత్రాన్ని ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. మే 15న ప్రారంభం కానున్న ఈ చిత్రం ఆగష్టు లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు