ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగాస్టార్ పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ కి, చిరు వివరణ ఇవ్వడం.. మొత్తానికి ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. తాజాగా ఇదే వ్యవహారంపై దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విధానం కరెక్ట్. ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్లు సత్యం’ అని చెప్పుకొచ్చారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిరంజీవితో పాటు చాలా మందిని ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకడిని. నేను సత్యం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని గాని, చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అక్కడ అవమానించలేదు. చాలా గౌరవించారు. ఇది నిజం. ఇక ముఖ్యంగా చిరంజీవి తీసుకున్న రోల్ కి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా. పరిశ్రమ పెద్దగా ఆయన తనవంతు కృషి చేశారు’ అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.