‘దేవర 2’లో ఆ తమిళ హీరో ?

devara

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా, ‘దేవర పార్ట్-2’ ఉండబోతుందని.. త్వరలోనే డిసెంబర్ లో షూట్ స్టార్ట్ కాబోతుందని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కొరటాల స్క్రిప్ట్ లో చేసిన మార్పుల విషయంలో కొత్త రూమర్ మొదలైంది. ఓ కీలక పాత్రను కొరటాల దేవర 2లో ప్లాన్ చేశారు. ఆ పాత్రలో తమిళ హీరో శింబు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

అన్నట్టు, ఈ పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా శింబు కోసం కొరటాల శివ ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడట. అలాగే, దేవర పార్ట్ 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్‌ కనిపించనుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించనున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version