ఆ పాట గుర్తుకు తెచ్చేలా.. ‘కాంతార 1’ నుంచి మరో పాట !

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన “కాంతార” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ‘కాంతార’లో ‘వరాహరూపం..’ పాట బాగా ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు దాన్ని గుర్తు చేసేలా ‘కాంతార:చాప్టర్‌1’లో మరో పాట సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘బ్రహ్మ కలశ’ అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అజనీష్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. అబ్బి వి ఆలపించారు.

కాగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుండగా, నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్‌ సినిమా పై అంచనాలను చాలా బాగా ఎలివేట్ చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా పై భారీ అంచనాలను ఉన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version