పవన్ రీసెంట్ స్టేట్మెంట్ పై ఆర్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్!

పవన్ రీసెంట్ స్టేట్మెంట్ పై ఆర్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్!

Published on May 31, 2025 3:07 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన సినిమా రిలీజ్ కి వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ లో సినిమా థియేటర్స్ బంద్ అనే మాటతో ఎంతలా హర్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే. దీనితో అక్కడ నుంచి టాలీవుడ్ బడా నిర్మాతలు ఈ బంద్ ఇంకా పవన్ ఆకస్మిక నిర్ణయాలు ఒకింత ఆసక్తికర పరిస్థితులు నెలకొల్పాయి.

అలాగే పవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ స్టేట్మెంట్ లో ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక టాలీవుడ్ నుంచి ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు అని కూడా మండిపడ్డారు. అయితే ఈ స్టేట్మెంట్ పై పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. పూర్వ కాలంలో రాజులే ప్రజల దగ్గరకి వెళ్లి సమస్యలు ఏంటి అని అడిగేవారు అని అలానే మీరు గెలిచిన తర్వాత ఇండస్ట్రీ వారిని పిలిచి తాము ఎలా ఉపయోగపడతామో అని అడగాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.

అయితే నిజానికి పవన్ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఆ మధ్య బడా నిర్మాతలు అంతా పవన్ ని కలిశారు అక్కడే పవన్ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పినట్టుగానే ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా చేస్తాము అని అందరూ ఒకసారి మాట్లాడుకొని తమ ప్రభుత్వం దగ్గరకి ఒక కూలంకశ పరిష్కారం తీసుకోవాలని చెప్పారు. కానీ దానిని వారంతా పెడచెవిన పెట్టారని ఈ మధ్య మన నిర్మాతలే చెప్పుకొచ్చారు. ఇదే ఆర్ నారాయణమూర్తి కూడా చెప్పడంతో మళ్ళీ ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు