వివిధ విభాగాలలో విస్తరించనున్న పి.వి.పి సంస్థ

prasad-v

సినీరంగంలోనే కాక పి.వి.పి సంస్థ ఇతర విభాగాలలో సైతం విస్తరిస్తుంది. ఇప్పటికే మొదటిసారిగా తెలుగు సినీరంగంలో పి.వి.పి సంస్థ నిర్మాణం చేపట్టిన ‘బలుపు’ సినిమా రవితేజకే కాక, వారికి కుడా హిట్ ను అందుకున్నారు.ప్రస్తుతం అనుష్క, ఆర్య నటిస్తున్న ‘వర్ణ’ నిర్మాణ పనులలో వున్నారు. తాజాగా పి.వి.పి సంస్థ చైర్మన్ ప్రసాద్ వి పోట్లురి త్వరలో పవన్ కళ్యాన్ తో ఒక భారీ ప్రాజెక్ట్ తియ్యనున్నట్టు ప్రకటించారు.

అయితే ఇప్పుడు పి.వి.పి సంస్థ క్రీడారంగంలోకి ప్రవేశించింది. ఇండియన్ బ్యాడ్ మింటన్ లీగ్ లో హైదరాబాద్ భాధ్యతలను చేపట్టారు. ‘హైదరాబాద్ హాట్ షాట్స్’ అనే పేరును ఈ జట్టుకు పెట్టారు. ఈ జట్టుకు ఐకాన్ ప్లేయర్ గా ఎంపికైన సైనా నెహ్వాల్ కు భారీ మొత్తంలో చెల్లించారు. త్వరలో మొదలుకాబోతున్న ఈ పోటిలో మరిన్ని పెద్ద కంపెనీలు ప్రవేశించచ్చు అని అంచనా

Exit mobile version