పీవీపీ సినిమా వారు నిర్మించిన మాస్ మహారాజ రవితేజ ‘బలుపు’ సినిమా మంచి విజయాన్ని సాదించింది. దీనితో ఈ నిర్మాణ సంస్థ ఆంద్ర ప్రదేశ్ లో మరో భారీ ప్రాజెక్ట్ ను చేయాలని చూస్తోందని సమాచారం. ఈ సినిమాని టాప్ హీరోస్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేసే అవకాశం వుంది. పీవీపీ సినిమా వారు తెలుగులో నిర్మించిన మొదటి సినిమా’బలుపు’. గత సంవత్సరం ఎస్. ఎస్. రాజమౌళి గారు తీసిన ‘ఈగ’ సినిమాని ఈ నిర్మాణ సంస్థ తమిళనాడులో డిస్ట్రిబ్యూటింగ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించి అధికారికంగా ప్రకటించగానే మేము మీకు తెలియజేస్తాం. ‘బలుపు’ సినిమా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్, యు.ఎస్.ఎ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ వారం చివరి వరకు ఈ సినిమా కలెక్షన్ బాగానే వున్నాయి. ఈ సినిమాను నిర్మించిన వారికి, పంపినిదరులకు మంచి లాబాలను తెచ్చిపెట్టింది.