ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్

ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్

Published on Jul 26, 2025 11:05 AM IST

మళయాళ సినిమా దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ నటుల్లో మంచి ఆదరణ ఉన్న స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. తెలుగులో పుష్ప సినిమాలతో మరింత రీచ్ ని తెలుగులో అందుకున్న ఈ నటుడు తన సినీ కెరీర్ పై చేసిన కొన్ని కామెంట్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే సౌత్ లో తన టాలెంట్ తో తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో సత్తా చాటిన ఫహద్ తన రిటైర్మెంట్ కోసం చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తన నటన ఎప్పుడైతే ప్రేక్షకులు బోర్ కొట్టేసింది అని అనిపిస్తుంది ఆరోజున సినిమాలు ఆపేస్తానని తాను తెలిపారు. అలాగే సినిమాలు ఆపేసి బార్సిలోనాలో ఒక క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ లీడ్ చేసుకుంటానని ఫహద్ తెలిపాడు. దీనితో తన ఊహించని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఫహద్ నుంచి ప్రస్తుతం మారేశన్ అనే సినిమా విడుదలకి రాగ మరిన్ని సినిమాలు తన నుంచి రాబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు