శరవేగంగా జరుగుతున్న ఇద్దరమ్మాయిలతో షూటింగ్

శరవేగంగా జరుగుతున్న ఇద్దరమ్మాయిలతో షూటింగ్

Published on Mar 14, 2013 6:13 PM IST

puri-with-bunni

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూనిట్ స్పెయిన్ లో ఈ సినిమా పనిలో వున్నారు. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాలోని 4 పాటలను చిత్రీకరించారు. ఇంకా ఒక పాట, కొన్ని సన్నివేశాలను మిగిలివున్నాయి. వీటిని హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో క్యాథరిన్ త్రిస, అమల పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైలిష్ గా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు