షూటింగ్ మొదలుపెట్టిన పూరి-సేతుపతి చిత్రం

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది.

హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, అందాల భామ సంయుక్త మీనన్ లపై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఇక ఈ సినిమాలో టబు, దునియా విజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఛార్మితో కలిసి పూరి ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version