‘కిల్లర్’ కోసం ఎస్.జె.సూర్యతో చేతులు కలిపిన రెహమాన్

తమిళ వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘కిల్లర్’. ఆయనే హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు. నటుడిగా బిజీగా ఉన్న ఎస్.జె.సూర్య ఇప్పుడు తిరిగి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మేజర్ అప్డేట్ అయితే మేజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించేందుకు రెడీ అయ్యాడు. కిల్లర్ ట్యూన్స్‌తో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు రెహమాన్ సిద్ధమవుతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఎస్.జె.సూర్య – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో గతంలో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ‘కిల్లర్’ సినిమాకు రెహమాన్ ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version