తమ్ముడి కోసం లవ్ స్టొరీ రాసిన పూరి జగన్నాధ్

తమ్ముడి కోసం లవ్ స్టొరీ రాసిన పూరి జగన్నాధ్

Published on May 3, 2012 5:29 PM IST


దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పూరి జగన్నాధ్. తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సాయిరామ్ హీరోగా నటిస్తున్న ‘రోమియో’ అనే సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. గోపి గణేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అడోనికా హీరొయిన్ గా నటిస్తుంది. గోపి గణేష్ గతంలో పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. యూరోపియన్ లోని వెరోన చుట్టూ ఈ తిరిగే ఈ ప్రేమకథ రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు