ఈ నెలాఖరు నుండి మొదలు కానున్న పూరి – నితిన్ మూవీ

ఈ నెలాఖరు నుండి మొదలు కానున్న పూరి – నితిన్ మూవీ

Published on Aug 12, 2013 1:55 PM IST

Puri-Nithin

యంగ్ హీరో నితిన్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి మనకు తెలిసిందే. ‘హార్ట్ అటాక్’ అని టైటిల్ పెట్టిన ఈ సినిమా ఆగష్టు 30 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. గత కొన్ని రోజులగా ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి టీం సంబందించిన వారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం యాక్షన్ కలగలిపిన పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని సమాచారం.

ఈ మూవీ కోసం హీరోయిన్స్ ని ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. ప్రస్తుతం నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా చేయనున్నారు.

తాజా వార్తలు