పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న పూరి జగన్నాథ్


తెలుగు చిత్ర పరిశ్రమలో గత 15 – 20 ఏళ్ళుగా ఎవ్వరు చెయ్యలేని పనిని పూరి చేశాడు. 2012 సంవత్సరానికి గాను పూరి జగన్నాథ్ నాలుగు చిత్రాలను విడుదల చెయ్యనున్నారు. అది కూడా పరిశ్రమలో టాప్ హీరోస్ తో ఈ చిత్రాలు చేస్తున్నారు. సంవత్సరానికి ఒక చిత్రం కూడా చెయ్యని దర్శకులున్న ఈ కాలంలో ఇది అద్భుతమయిన సాధనే అని చెప్పాలి.ఈ ఏడాది ఈయన చిత్రాలు మహేష్ బాబుతో “బిజినెస్ మాన్”,రవితేజ “దేవుడు చేసిన మనుషులు”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కెమెరా మెన్ గంగతో రాంబాబు” మరియు అల్లు అర్జున్ తో డిసెంబర్ 21న విడుదలయ్యే చిత్రాన్ని చేస్తున్నారు. “ఇంత వేగంతో అప్పట్లో ఎన్టీయార్,అక్కినేని నాగేశ్వర రావు మరియు సూపర్ స్టార్ కృష్ణ కాలంలో సంవత్సరానికి 4 -5 చిత్రాలు విడుదల చేసేవారు అప్పట్లో ఇది తరుచుగా జరిగేది ఇలా చేసిన దర్శకుల్లో కోడి రామ కృష్ణ చివరి దర్శకుడు 1988 -1989 లో ఇది చెయ్యగలిగారు. ఇలా వేగంగా చిత్రాలు చెయ్యడం ద్వారా పెద్ద నిర్మాణ సంస్థలకు చాలా మంచిదే కాకుండా చాలా మందికి జీవనోపాధి కలిగిస్తుంది” అని ఒక చిత్ర విశ్లేషకుడు అన్నారు.

ఇలానే పూరి వేగంగా మరిన్నిచిత్రాలు చెయ్యాలని ఆశిస్తూ అయన రాబోతున్న రెండు చిత్రాలు కూడా ఘన విజయం సాదించాలని కోరుకుంటున్నాం.

Exit mobile version