పవర్ ఫుల్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ స్టెప్పులకు మీరు సిద్దమేనా??

పవర్ ఫుల్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ స్టెప్పులకు మీరు సిద్దమేనా??

Published on May 4, 2013 1:00 PM IST

Iddarammayilatho

సినిమా రంగంలో తెరవెనుక వుండే దర్శకులు తెరమీదకు రావడం చాలా అరుదు. తెలుగు తెరపై ఆ అరుదైన దృశ్యాన్ని ‘మగధీర’ సినిమా ద్వారా చూసాం. ఇందులో డైరెక్టర్ రాజమౌళితో పాటు తదితర బృందమంతా ఒక పాటకు స్టెప్పులేసారు. ఇప్పుడు అదే సూత్రాన్ని మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫాలో అవుతున్నాడు. గౌతం మీనన్ తీసిన ‘ఏం మాయ చేసావే’ సినిమాలో పూరి మొదటిసారిగా వెండితెరమీద కనిపించాడు. ఇప్పుడు తను తీస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ‘టాప్ లేచిపోద్ది’ పాటలో దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత బండ్ల గణేష్ కొన్ని క్షణాలపాటు కనపడి నృత్యం చేస్తారని సమాచారం. సో, టాప్ లేపెయ్యడానికి ‘ఇద్దరమ్మాయిలతో’ బృందం సిద్దంగావుంది. మరి మీరు సిద్దమేనా??

తాజా వార్తలు