పూరి – ప్రభాస్ కాంబినేషన్లో మరో సినిమా?

పూరి – ప్రభాస్ కాంబినేషన్లో మరో సినిమా?

Published on Dec 9, 2012 8:00 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఇదిలా ఉండగానే పూరి నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే పూరి ప్రకటించారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పూరి – ప్రభాస్ కాంబినేషన్లో ఇప్పటికే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం ప్రభాస్ కూడా తన తదుపరి చిత్రం ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేయనున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి – ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత సుమారు ఒక సంవత్సరం పడుతుంది కావున ఆ సమయంలో పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశం లేదు. పూరి, ప్రభాస్ సినిమా పై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు