స్పెయిన్ వెళ్ళిన పూరి జగన్నాధ్

స్పెయిన్ వెళ్ళిన పూరి జగన్నాధ్

Published on Feb 3, 2013 4:34 PM IST

Puri-Jagan

బ్యాంకాక్లో భారీ షెడ్యూల్ తరువాత అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో షూటింగ్ స్పెయిన్ కి మారనుంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 8 నుండి ప్రారంభం కానుండగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నాడని సమాచారం. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా అమలా పాల్, కేథరిన్ తెరిస్సా నటిస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ న్యూ లుక్ తో కనిపించబోతున్న ఈ సినిమాని బండ్ల గణేష్ ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు