డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ప్రొడక్షన్ నుండి ఫిల్మ్ కెమెరాని వదిలేస్తున్నారు. అదే స్థానంలో డిజిటల్ కెమెరాలను ఉపయోగించనున్నారు. స్టైలిష్ స్టార్ తో తీయనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకోసమే పూరి రెండు అర్రి అలెక్సా కెమెరాలను తీసుకున్నారు. హై క్వాలిటీ అవుట్ పుట్ కోసం అలెక్స్ కెమెరాలకి అల్ట్రా ప్రైమ్ లెన్స్ ని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్లో ‘లైఫ్ అఫ్ ఫై’, ‘స్కై ఫాల్’ మరియు ‘అవెంజర్స్’ సినిమాలని ఈ అర్రి అలెక్స్ కెమెరాలతో షూట్ చేసారు.
డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా ఓవర్సీస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అమలా పాల్ మరియు కేథరిన్ తెరిసా హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. టెక్నికల్ గా మార్పులు చేసి పూరి తీస్తున్న ఈ సినిమా కొత్త లుక్ మరియు ఫీల్ కలుగజేస్తుంది.