కొత్త స్టొరీకోసం బ్యాంకాక్ వెళ్ళనున్న పూరి

Puri-Jagan
దర్శకుడు పూరి జగన్నాధ్ కి బ్యాంకాక్ అంటే ఎంత ప్రేమో సినీ ప్రియులకు చెప్పనవసరం లేదు. తరచూ బ్యాంకాక్ కు వెళ్ళే ఈ దర్శకుడికి అక్కడ ప్రభుత్వం ప్రత్యేక హోదాని కూడా కలిపించిది. తన ప్రతీ సినిమా స్క్రిప్ట్ ని అక్కడే రాసుకునే పూరి ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ కోసం ఈరోజు థాయ్ సిటీకి వెళ్లనున్నాడు

కొన్ని వారాల తరువాత స్క్రిప్ట్ సిద్దం చేసుకుని తిరిగి ఇండియా చేరుకోనున్నాడు. తన తదుపరి సినిమా ఎన్.టీ.ఆర్ తో అని అంటున్నా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేష్ తో ఒక ప్రాజెక్ట్ కూడా లైన్ లో వుంది

పూరి గతచిత్రం హార్ట్ ఎటాక్ సినిమా మంచి విజయాన్నే సాధించి లాభాలను తెచ్చిపెట్టింది

Exit mobile version