ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘పప్పీ షేమ్’ అంటూ సాగే ఈ పాట కాలేజీలో జరిగే టీజింగ్ నేపథ్యంలో సాగుతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రామ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ పప్పీ షేమ్ పాటను సెప్టెంబర్ 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా ఉపేంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.