ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

Inspector-Zende

విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : నెట్ ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మనోజ్ బాయ్ పాయి, జిమ్ షర్బ్, విజయ ఓక్, సచిన్ ఖేడేకర్ తదితరులు
దర్శకుడు : చిన్మయ్ డి మండలేకర్
నినిర్మాతలు : ఓం రౌత్, జే శేవక్రమణి
సంగీతం : సంకేత్ సేన్, కేతన్ సోదా
సినిమాటోగ్రఫీ : విశాల్ సిన్హా
ఎడిటింగ్ : మేఘన మన్చంద్ర సేన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చిన సినిమా ‘ఇన్స్పెక్టర్ ఝండే’ కూడా ఒకటి. మనోజ్ బాజ్ పాయి అలాగే రీసెంట్ కుబేర విలన్ జిమ్ షర్బ్ కలయికలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ నిర్మాణంలో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా కొంతమేర కల్పిత అంశాలతో తెరకెక్కించబడింది. అది 1986 ముంబై పోలీస్ అంటే అప్పటి గూండాలకి వణుకు. కానీ ఆ సమయంలోనే ఒక పేరు మోసిన కిల్లర్, నేరగాడు కార్ల్ భోజ్ రాజ్ (జిమ్ షర్బ్) 33 హత్యలు చేసి తీహార్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అయితే అతన్ని మొదటిగా పట్టుకున్న ఆగ్రిపడ పోలీస్ మనోజ్ బాజ్ పాయ్ (మధుకర్ బాబురావు ఝండే) అండ్ టీం మళ్ళీ ఈ కేసు సీక్రెట్ ఆపరేషన్ గా డీజీపీ పురంధరే (సచిన్ ఖేడేకర్) అందిస్తారు. మరి అక్కడ నుంచి ఝండే టీం ఏం చేశారు. ఆ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా? ఇంకోపక్క ఇతర రాష్ట్రాల వారు కూడా గాలిస్తున్న క్రిమినల్ ని పట్టుకున్న క్రెడిట్ ఎవరికి దక్కింది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

సాధారణంగా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించే చిత్రాలు అన్నీ దాదాపు డీసెంట్ గానే ఉంటాయి. అలానే ఇది కూడా అదే రీతిలో డీసెంట్ గా సాగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాని సెటప్ చేసిన వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి టోన్ లో తీసుకెళ్లారు. అప్పటి పరిస్థితులు చాలా సహజ సిద్ధంగా దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

ఇక నటుడు మనోజ్ భాజ్ పాయి ఈ తరహా సినిమాలకి ఎందుకు పర్ఫెక్ట్ అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ లో తనని ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ లో ఎలా చూసామో ఇందులో కూడా మంచి నటన, ఆకట్టుకునే హ్యూమర్, పోలీస్ ల విషయంలో కొన్ని ఎమోషన్స్ ని బాగా పండించారు. ఇక తనతో పాటుగా తన భార్య నటి విజయ ఓక్ బ్యూటిఫుల్ లుక్స్ లో మంచి నటన కనబరిచారు.

ఇక నటుడు సచిన్ ఖేడేకర్ కూడా మంచి పాత్రలో కనిపించగా విలన్ రోల్ లో జిమ్ షర్బ్ కి మరోసారి డీసెంట్ రోల్ దక్కింది. ఓ కిల్లర్ గా మంచి నటన తాను కనబరిచారు. అలాగే మనోజ్ టీం తో ఉన్న ఆఫీసర్స్ పాత్రధారులు బాగా చేశారు. వారిపై మంచి సిచువేషనల్ కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. ఇంకా మనోజ్ కి జిమ్ కి నడుమ కనిపించే ఇన్వెస్టిగేషన్ మూమెంట్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం ఎంత నిజ జీవిత ఘటనలపై తెరకెక్కించినప్పటికీ కథనం మాత్రం ఒకింత స్లోగా సాగదీతగా వెళుతుంది. దీంతో కొంతమేర సన్నివేశాలు డీసెంట్ గా అనిపిస్తే కొంతమేర కథనం స్లోగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్స్ కూడా లేవు. మిగతా సెటప్ అంతా బాగానే చేసుకున్నారు కానీ అంతమంది పోలీసులు ముందే విలన్ ఉంటాడు కానీ వారెవరు కూడా అతన్ని చూడకపోవడం అనేది చాలా సిల్లీగా ఉంటుంది.

అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నారుగా అని ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ లాంటి మూమెంట్స్ ని ఆశిస్తే కొంచెం నిరాశ పడవచ్చు. ఇది వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో కావడంతో ఆ సమయానికి తగ్గట్టుగా ఉన్న మూమెంట్స్ ని మరీ కొత్తదనాన్ని జోడించకుండా స్లో గా నడిపించేసారు. సో వీటి విషయాల్లో మాత్రం ఈ సినిమా డల్ గా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ముఖ్యంగా వింటేజ్ సెటప్ ని చాలా నీట్ గా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చేసిన విధానం మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకి తగ్గట్టుగా ఇచ్చిన సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్ లు ఇంప్రెస్ చేస్తాయి. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ గా చేయాల్సింది. ఇక చిన్మయ్ డి మండలేకర్ విషయానికి వస్తే.. తాను డీసెంట్ అంశాన్ని తీసుకొని ఎంటర్టైనింగ్ కోణంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం ఒకింత స్లోగా ఉందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్, కామెడీ సీన్స్ ని బాగా తెరకెక్కించారు. నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లు కూడా రాబట్టారు. కాకపోతే ఇంకొంచెం ఎంగేజింగ్ గా కథనాన్ని నడిపి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ” ఇన్స్పెక్టర్ ఝండే” స్లోగా సాగినా ఓకే అనిపించే ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు. మనోజ్ బాజ్ పాయి అలాగే జిమ్ షర్బ్ లు తమ పాత్రల్లో మెప్పించగా అక్కడక్కడా మంచి కామెడీ సీన్స్ సహా వింటేజ్ సెటప్ ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. కాకపోతే నెమ్మదిగా సాగే కథనం మాత్రం కొంచెం డ్రా బ్యాక్ అని చెప్పొచ్చు. సో స్లోగా ఉన్నా పర్లేదు మనోజ్, జిమ్ లాంటి ఓటిటి స్టార్స్ నుంచి ఒక కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూడాలి అనుకునేవారు ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version