ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు సెట్ చేసిన ఈ సినిమాకి అదే రీతిలో అవార్డులు కూడా వస్తున్నాయి. ఇలా లేటెస్ట్ గా పుష్ప 2 చిత్రం సైమా 2025 అవార్డ్స్ లో మెరిసింది.
మరి ఉత్తమ హీరోయిన్, దర్శకుడు జాబితాలో సుకుమార్, రష్మిక మందన్నలు అవార్డు అందుకోగా ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. మరి తన అవార్డుతో దిగిన మెమొరబుల్ పిక్ ని షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసాడు. అంతే కాకుండా తనకి వచ్చిన అవార్డుని తన అభిమానులకి అంకితం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో బన్నీ పోస్ట్ అండ్ పిక్ వైరల్ గా మారాయి.