రానా పెళ్లి అనంతరం ప్రత్యేక బహుమతులు పంపిన సురేష్ బాబు.!

ఇటీవలే మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరియు మిహికా బజాజ్ ల వివాహం హైదరాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా తగు జాగ్రత్తలు వహించి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆగష్టు 8న హైదరాబాద్ లో పలువురు కీలక బంధువులు మరియు సినీ పెద్దలు సమక్షంలో వీరి వివాహం చాలా సింపుల్ గా తక్కువ మంది అతిధుల తోనే జరిగిపోయింది.

అయితే ఈ వివాహానికి హాజరు కాని వారి కోసం మాత్రం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వర్చువల్ రియాలిటీ కిట్ ద్వారా చూసే విధంగా ప్లాన్ చెయ్యడం కాస్త వినూత్నంగా అనిపించింది. అయితే ఇప్పుడు రానా వివాహం అనంతరం ఆయన తండ్రి మరియు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరికొంత మంది ప్రముఖ సినీ పెద్దలకు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ను తయారు చేయించి పంపారు.దానితో పాటు స్పెషల్ నోట్ తో రానా మరియు మిహికాల యువ జంటను ఆశీర్వదించామని దగ్గుబాటి సురేష్ బాబు మరియు లక్ష్మి గార్లు సతీసమేతంగా కోరారు.

Exit mobile version