ఇంటర్వ్యూ : దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి – ‘కాంత’ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలి..!

టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ ఈ నెల 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ సల్మాన్, రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

రానా గారు ఇది బయోపిక్ అని వినిపిస్తుంది.. నిజమేనా?

ఇది బయోపిక్ కాదు, పూర్తిగా ఫిక్షనల్ కథ. గతంలో స్టూడియోల్లో జరిగిన కొన్ని సంఘటనల నుంచి ప్రేరణ పొందిన కథ ఇది. మద్రాస్‌లో ప్రీమియర్‌ చూపించాక అన్నీ క్లియర్‌ అవుతాయి.

దుల్కర్ గారు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇది బియోపిక్ అని మీకు అనిపించలేదా?

లేదండి. అంతా చాలా క్లియర్ గా ఉంది. నాకు కథ నచ్చింది. నేను ఇంకేది ఆలోచించలేదు. మీరు సినిమా చూసినప్పుడు కూడా దీన్ని ఒక మంచి కథగానే ఫీలవుతారు.

రానా గారు ఈ కథని సురేష్ బాబు గారికి చెప్పారా?

చెప్పారండి. ఆయన చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆనాటి స్టూడియోస్ లో తిరిగారు. ఆయన ఇన్పుట్స్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి.

దుల్కర్ గారు కాంత సినిమా ఎలా ఉండబోతుంది?

కాంత నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. నేను రానా ఈ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనుకున్నాం. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎనర్జీ ఉంటుంది.

డైరెక్టర్ సెల్వ గురించి?

డైరెక్టర్ సెల్వ కథని చాలా అద్భుతంగా చెబుతాడు. ఫస్ట్ టైం ఫిలిం మేకర్‌లో ఉండాల్సిన పాషన్ తనలో కనిపించింది. ప్రతిదీ రీసెర్చ్ చేసి పెట్టుకున్నాడు.

రానా గారు ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?

కాంత మ్యూజిక్ కూడా ఒక డిస్కవరీ. ఇది 50లో జరిగే సినిమా. ఆ టైంలో మ్యూజిక్ లా ఉండాలి. ఈ కాలం ఆడియన్స్ కూడా నచ్చాలి. అలా వర్క్ చేయడం నిజంగా చాలెంజింగ్. ఈ సినిమాలో పాటలు, బీజీఎం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

పాతాళభైరవికి ఉపయోగించిన కెమెరాని కనిపిస్తుందని విన్నాం?

అవునండి. ఆ కాలంలో వాడిన చాలా అరుదైన పరికరాలు ఎందులో కనిపిస్తాయి.చాలా గొప్ప గొప్ప సినిమా సెట్స్ లో తిరిగిన వస్తువులు మా సెట్లో ఉన్నాయి .అవి స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. పాతాళ భైరవి ఇలాంటి కెమెరాల్లో తీశారా అని సర్ప్రైజ్ అవుతారు.

డిఓపి డాని గురించి?

డాని ‘మహానటి’ ‘విరాటపర్వం’ చేశారు. ఆయన స్పానిష్ నుంచి ఇండియాకు వచ్చారు. మనల్ని ఆయన చూసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. టైంని రీ-క్రియేట్ చేయడానికి ఆయనే కరెక్ట్ పర్సన్ అనిపించింది. ఈ సినిమాకి ఒక ఎపిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు.

Exit mobile version