స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆత్మకూరుకు చెందిన ముగ్గురు బాలలు తల్లితండ్రులను కోల్పోయి అనాధలు అయ్యారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ లో వీరికి ఆసరాగా నిలబడాలని సోనూ సూద్ కి సందేశం పంపడం జరిగింది. ఆ ముగ్గురు బాలలను నాసిక్ లోని ఓ అనాధ ఆశ్రమంలో చేర్చేందుకు సోనూ సూద్ ముందుకు వచ్చారు. ఐతే ఇదే విషయం నిర్మాత దిల్ రాజుకు తెలియడంతో ఆయన ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొనేందు ముందుకు వచ్చారు.
అనాధ బాలల విషయంలో దిల్ రాజు స్పందించిన తీరుకు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా పొగుడుతున్నారు. దిల్ రాజు ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఎదిగారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో వకీల్ సాబ్, జెర్సీ హిందీ రీమేక్ వంటివి వున్నాయి.