టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే చిరు ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఇదే విషయాన్ని ఎంతో మంది యువ నటులు ఎన్నో సార్లు సభా ముఖంగా తెలిపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్నారు.
అలాగే తన భావాలను కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మెగాస్టార్ పై ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు. “కష్టంతో పైకి వచ్చిన వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్లకి ఏ అండ లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనసు ప్రేమ అ అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్న అందుకు మీరే ఉదాహరణ యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆశ వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. కొణిదెల చిరంజీవి గారు” అంటూ ఆయన్ను ట్యాగ్ చేసి తెలిపారు.
కష్టంతో పైకి వచ్చిన వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్లకి ఏ అండ లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనసు ప్రేమ అ అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్న అందుకు మీరే ఉదాహరణ యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆశ వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.@KChiruTweets గారు
— BANDLA GANESH. (@ganeshbandla) July 21, 2020