ఇంద్ర రిమేక్ రైట్స్ ఎవరికీ అమ్మలేదు : ప్రియాంక దత్

ఇంద్ర రిమేక్ రైట్స్ ఎవరికీ అమ్మలేదు : ప్రియాంక దత్

Published on Jul 22, 2012 7:48 PM IST


ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను వరుసగా బాలీవుడ్లో రిమేక్ చేస్తున్నారు. అలా రిమేక్ చేసిన ప్రతి సినిమా బాలీవుడ్లో సక్సెస్ అవుతున్నాయి. ఇటీవలే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘విక్రమార్కుడు’ సినిమాకి రిమేక్ గా తెరకెక్కిన ‘రౌడీ రాథోర్’ బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది మరియు 100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాల పక్కన చేరిపోయింది. ఈ చిత్ర విజయం తర్వాత, ఈ చిత్ర నిర్మాత సంజయ్ లీలా భన్సాలి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాని అక్షయ్ కుమార్ ని హీరోగా పెట్టి దర్శకత్వం వహించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

తెలుగులో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ నిర్మించారు, ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ మాట్లాడుతూ ‘ ‘ఇంద్ర’ చిత్ర రైట్స్ కోసం చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఈ చిత్ర రైట్స్ ని ఇప్పటి వరకూ ఎవరికీ అమ్మలేదు. ఈ చిత్రాన్ని హిందీలో మా ప్రొడక్షన్ లోనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం అని’ ఆమె అన్నారు. ఇప్పుడు చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే ‘ఇంద్ర’ సినిమా త్వరలోనే హిందీలో ప్రారంభం కానుందా లేక ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి, సోనాలి బ్రిందే మరియు ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది మరియు రాయలసీమ ఫాక్షనిజం అత్యద్భుతంగా చూపించిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

తాజా వార్తలు