ప్రారంభమైన ప్రియమణి అంగుళీక

Priyamani-(4)
‘చారులత’ సినిమాలో అవిభక్త కవలుగా కనిపించిన ప్రియమణి మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రేమ్ ఆర్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అరుంధతి సినిమాలో అనుష్కకి జంటగా నటించిన దీపక్ హీరోగా నటిస్తున్నాడు. ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. డైరెక్టర్ ప్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా సూర్యుడి మీద ఉంటుంది, నూతన దంపతుల మీద ఒక దుష్ట శక్తి దాడి చేస్తే ఏం జరిగింది అనేదే సినిమా. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ లేదా మేలో విడుదల చేస్తామని’ అన్నారు.

ప్రియమణి మాట్లాడుతూ ‘ ప్రేమ్ చెప్పిన కథ వినగానే ఎంతో బాగా నచ్చింది. నటనకి పూర్తి ఆస్కారం ఉన్న పాత్రని ఇందులో చేస్తున్నానని’ అంది. శ్రీ శంఖు చక్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కోటి – సి.హెచ్ రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్యాం మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version