మోడల్ గా కెరీర్ ని ప్రారంభించి సౌత్ ఇండియాలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి ఈ మధ్య సినిమాలు చేయడంలో కాస్త వెనుకబడింది. చేస్తున్న ఒకటి రెండు సినిమాలు కూడా విజయాన్ని అందించలేకపోయాయి. చివరిగా ప్రియమణి తెలుగులో చేసిన ‘చండీ’ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం మలయాళం కన్నడలో సినిమాలు చేస్తోంది.
ఇటీవలే ఓ ప్రముఖ మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టపడి చేసిన సీన్ ఏదని అడిగితే ‘ పరుత్తివీరన్ సినిమా క్లైమాక్స్ కోసం నేను చేసిన సీన్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. అసలు ఒక గ్యాంగ్ నన్ను రేప్ చేసే సీన్ ఉందని నాకు అప్పటి దాకా తెలియదు. అలాగే ఆ సీన్ ఓ రూంలో జరుగుతుంటే కెమెరా, టెక్నీషియన్స్ అంతా మరో రూంలో కూర్చొని షూట్ చేసారు. అసలు సీన్ కరెక్ట్ గా వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు బాగా నరకం చూపించిన సీన్ అదే అని’ తెలిపింది. ప్రియమణి అదే సినిమాలో ప్రదర్శించిన నటనకి నేషనల్ అవార్డుని గెలుచుకుంది.