చైల్డ్ లేబర్ మీద పోరాడనున్న ప్రియ ఆనంద్

ఈ మధ్య కాలంలో ప్రియ ఆనంద సామజిక బాధ్యతను అందరికి గుర్తు చేస్తున్నారు. పెటాతో కలిసి వీధి కుక్కలను చంపడం పై వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టిన ఈ భామ తరువాత పక్షులను బంధించడానికి వ్యతిరేకంగా మరో కార్యక్రమం చేపట్టారు తాజాగా బాల కార్మీక వ్యవస్థ మీద ఈ భామ మంది పడ్డారు “శివకాశిలో చాలా వరకు బాల కార్మికులే ఉంటారు అటువంటి ప్రమధకరమయిన పరిస్థితుల్లో వారిని పని చేయించడం మంచిది కాదు అందుకే నేను బాణాసంచాకి దూరంగా ఉంటాను” అని అన్నారు.ఈరోజు పొద్దున్న “సేవ్ ది చిల్ద్రెన్” అనే సంస్థతో కలిసి పని చేస్తున్నట్టు ఇక నుండి బాలకార్మిక వ్యవస్థ మీద మాత్రమే కాదు ఇంకా చాల వాటికీ వ్యతిరేకంగా పిల్లల సంరక్షణ కోసం పని చేస్తాను అని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ నటి తన రాబోతున్న చిత్రం “కో అంటే కోటి” డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Exit mobile version