ఇంగ్లీష్ వింగ్లిష్ తన లైఫ్ టైం సినిమా అంటున్న ప్రియ ఆనంద్


గౌరీ షిండే దర్శకత్వంలో శ్రీదేవి తిరిగి తెర మీద కనిపించిన చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” ఈరోజు విడుదల అయ్యింది. ఈ చిత్రంలో తన పాత్రకు వస్తున్న స్పందన చూసిన ప్రియ ఆనంద్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాదాపుగా 15 ఏళ్ళ తరువాత శ్రీదేవి తెర మీద కనిపించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి అద్భుతమయిన స్పందన దక్కించుకుంది.ఈ చిత్రంతో ప్రియ ఆనంద్ బాలివుడ్ కి పరిచయం అయ్యారు. “గతంలో ఎప్పుడు లేని విధంగా మీడియా నుండి ఫోన్ కాల్స్ మరియు మెసేజెస్ వస్తున్నాయి “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం నా జీవితంలో గుర్తుండిపోయే చిత్రం” అని ప్రియ ఆనంద్ అన్నారు. ఆమె ప్రస్తుతం శర్వానంద్ సరసన “కో అంటే కోటి” మరియు “రంగ్రేజ్” చిత్రాల చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు ఇది కాకుండా హిందీలో ఒక చిత్రం తమిళంలో “ఎదిర్ నీచల్” అనే చిత్రం లో నటిస్తున్నారు.

Exit mobile version