లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియ ఆనంద్ ఆ చిత్రం తరువాత పలు చిత్రాలు చేసినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది ఈ మధ్యనే ఈ భామ కథానాయికగా “కో అంటే కోటి” చిత్రం వచ్చింది. తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ఒకటి తెలుగులోకి అనువాదమవుతుంది. “ఎబిసిడి” అనే పెరుతో రానున్న ఈ చిత్రానికి “అందరు ఇంజనీర్లె” అన్నది ఉపశీర్షిక. తమిళంలో “పుగై పడం” అన్న పేరుతో వచ్చిన ఈ చిత్రానికి రాజేష్ లింగం దర్శకత్వం వహించారు సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ మీద ఆర్ సత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. కాలేజిలో చదువుకునే ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగే కథ ఈ చిత్రం. కోడైకనాల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి గంగై అమరాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చెయ్యనున్నారు.