ప్రేమ ఇష్క్ కాదల్ కి ‘ఏ’ సర్టిఫికేట్

ప్రేమ ఇష్క్ కాదల్ కి ‘ఏ’ సర్టిఫికేట్

Published on Nov 29, 2013 9:45 AM IST

prema-ishq-kaadhal
డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా కథ ఓ కాఫీ షాప్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అక్కడ జరిగిన మూడు లవ్ స్టొరీలను మనకు చూపించనున్నారు.

హర్షవర్ధన్ రాణే, విష్ణు వర్ధన్, హరీష్ వర్మ, రీతు వర్మ, వితిక, శ్రీ ముఖి ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ద్వారా పవన్ సదినేని డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. డి. సురేష్ బాబు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మించారు. నారా రోహిత్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందాల రాక్షసి ఫేం శ్రవణ్ ఈ సినిమాకి మ్యూజిక్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు