శ్రీరామచంద్ర నటిస్తున్న ‘ప్రేమ గీమ జాంత నై’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బార్బీ ఈ సినిమాలో హీరొయిన్. ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా. మూడు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. సుబ్బు ఆర్.వి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శుభం క్రియేషన్స్ బ్యానర్ పై ముద్ధాల భాస్కర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ” ప్రేమ అన్న పదం మీదే అసహ్యం ఉన్న ఒక యువకుడు ప్రేమలో పడి తన ఆలోచనను ఏవిధంగా మార్చుకుంటాడు అనేది ఈ చిత్రకధ. ప్రేమకధలలో కొత్త కోణాన్ని చుపించబోతున్నాం. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని”అన్నాడు. వైజాగ్, అరకు ప్రాంతాలలో మూడు పాటలను చిత్రీకరించి మే చివరికల్లా షూటింగ్ ముగిస్తారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో జూన్ లో విడుదలకానుంది. నిర్మాతలు ఈ చిత్రాన్నిజూలైలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.