మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన ప్రేమ్ రక్షిత్

మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన ప్రేమ్ రక్షిత్

Published on Feb 12, 2013 3:30 PM IST

prem-rakshit2

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినూత్నమైన స్టెప్స్ కంపోజ్ చేసి తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యాడు. దాదాపు ఇండస్ట్రీలోని అందరి హీరోలకు బాగా గుర్తుండిపోయే డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసాడు. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రానున్న సినిమాకి పనిచేస్తున్నాడు.

ముందుగా ఈ సినిమాలో రెండు పాటలకి కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ని తీసుకున్నారు. కానీ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ కి మహేష్ బాబు బాగా ఇంప్రెస్ అవడంతో ఈ సినిమాలోని అన్ని పాటలకి తననే కోరియోగ్రాఫర్ గా తీసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు