పుకార్లను కొట్టిపారేసిన ప్రవీణ్ సత్తారు

పుకార్లను కొట్టిపారేసిన ప్రవీణ్ సత్తారు

Published on Mar 29, 2014 7:30 PM IST

praveen-sattaru

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చందమామ కథలు’ సినిమాపై వస్తున్న పుకార్లను ఆ చిత్ర డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కొట్టిపారేశారు. ఈ సినిమా పలు సినిమాల నుంచి కాపీ కొట్టిందని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ‘నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడే ఏ సినిమాని స్పూర్తిగా తీసుకోకూడదని లేదా మీ భాషలో ఏ సినిమాని కాపీ కొట్టకూడదని నిర్ణయించుకున్నానని’ ప్రవీణ్ సత్తారు అన్నాడు.

చందమామ కథలులో మంచి లక్ష్మీ, కృష్ణుడు, ఆమని, నరేష్, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ సత్తారు లక్ష్మీ మంచు, కృష్ణుడుపై పొగడ్తల వర్షం కూడా కురిపించాడు. ‘నేను మంచు లక్ష్మీ, కృష్ణుడు కోసం రాసిన పాత్రలని వారు తప్ప ఇంకెవరూ చేయలేరు. వాళ్ళు ఆ రోల్స్ చేయడానికి ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు. కేవలం 2 గంటల 10 నిమిషాలు సాగే సినిమాలో 3 క్లైమాక్స్ లు ఉంటాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ సెకండ్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు