త్వరలో ‘ఉలవచారు బిర్యాని’ క్లైమాక్స్ ను చిత్రీకరించనున్న ప్రకాష్ రాజ్

త్వరలో ‘ఉలవచారు బిర్యాని’ క్లైమాక్స్ ను చిత్రీకరించనున్న ప్రకాష్ రాజ్

Published on Dec 4, 2013 1:30 AM IST

ulavacharu-biryani
మూడు భాషలలొ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉలవచారు బిర్యాని’. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ మైసూర్ లో మొదలైంది, అంతేకాక డిసెంబర్ 5నుండి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలిపాడు

ప్రకాష్ రాజ్, స్నేహ, ఊర్వశి, సామ్యూక్తా హోర్నాడ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం మరియు సిహి కహి చంద్రు ఈ సినిమాలో ప్రధానపాత్రధారులు. ఈ సినిమా తాను అనుకున్నట్టే అందంగా తెరకెక్కుతుంది అని ప్రకాష్ రాజ్ ఆనందంగా వున్నాడు. చాలా భాగం మైసూర్ లోనే చిత్రీకరణ జరిగింది

ఈ సినిమా మలయాళ ‘సాల్ట్ ఎన్ పెప్పర్’కు రీమేక్. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. తెలుగు వర్షన్ ను దిల్ రాజు పంపిణీ చెయ్యనున్నడు. ఇళయరాజా సంగీతదర్శకుడు. 2014మొదట్లో ఈ సినిమాను విడుదలచెయ్యనున్నారు

తాజా వార్తలు