ప్రకాష్ రాజ్ ధోని చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్


ప్రకాష్ రాజ్ కొత్త చిత్రం ‘ధోని’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారి అబ్బాయి ఆకాష్ ధోని అంతటి క్రికెటర్ కావాలనే పాత్రలో నటిస్తుండగా అతని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ధోని చిత్రం ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రశ్నిస్తూ, పిల్లలు ఎమ్ కావాలనుకుంటున్నది తల్లితండ్రులు అర్ధం చేసుకోలేక పోతున్నారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా, కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు. రాధిక ఆప్టే ఒక పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version