డబుల్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

డబుల్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Published on Jan 31, 2014 3:45 PM IST

prakash-raj
నటుడిగా, డైరెక్టర్ గా ఇటు సౌత్ ఇండియాలో అటు బాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. టాప్ హీరో సినిమాల్లో విలన్ అన్నా, కీలక పాత్ర అన్నా, అతిధి పాత్ర అన్నా అన్నిటిలోనూ ఆయనే కనిపిస్తుంటారు. కొద్ది రోజుల నుంచి ప్రకాష్ రాజ్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సినిమా లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం పై ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు.

‘మహేష్ బాబు ఆగడు సినిమాలో డబుల్ రోల్ లో కనిపించానున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది ఆగడులో కాదు వివి వినాయక్ సినిమాలో డబుల్ రోల్ లో కనిపిస్తాను. ఆగడు లో నెగటివ్ పాత్రలో కనిపిస్తానని’ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడు. దీంతో వస్తున్న పుకార్లకు తెరపడింది. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఉలవచారు బిరియాని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు