అక్కడ సాలిడ్ స్టార్ట్ తో ‘డ్యూడ్’

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమిత బైజు అలాగే హీరోయిన్ నేహా శెట్టి మరో హీరోయిన్ గా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన అవైటెడ్ యూత్ ఎంటర్టైనర్ చిత్రమే “డ్యూడ్”. మంచి అంచనాలు తెలుగు, తమిళ్ లో సెట్ చేసుకున్న ఈ సినిమాకి ఒక సాలిడ్ స్టార్ట్ యూఎస్ మార్కెట్ లో దక్కింది అని చెప్పవచ్చు.

అక్కడ ఆల్రెడీ కేవలం ప్రీ సేల్స్ తోనే ఈ చిత్రం ఏకంగా లక్ష డాలర్స్ గ్రాస్ ని సొంతం చేసుకొని అదరగొట్టింది. దీనితో డ్యూడ్ కి మాత్రం అక్కడ మంచి స్టార్ట్ తో మొదలు అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ దీపావళి కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version