ఇంట్రెస్టింగ్: అప్పుడు ‘కింగ్డమ్’ ఇప్పుడు ‘సామ్రాజ్యం’ కోసం ఎన్టీఆర్

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ కలిగిన స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ గొంతుతో ఏదన్నా గ్లింప్స్ లేదా టీజర్ లాంటివి వస్తే వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇలా కొన్నాళ్ల కితం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ “కింగ్డమ్” కోసం తారక్ వాయిస్ ఓవర్ అందించగా దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇపుడు ఇంట్రెస్టింగ్ యాదృచ్చికం అనుకోవాలి.. ‘సామ్రాజ్యం’ అనే సినిమా కోసం తారక్ తన వాయిస్ ఓవర్ అందించనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. నిజానికి కింగ్డమ్ చిత్రానికి అనుకున్న మరో టైటిల్స్ లో సామ్రాజ్యం కూడా ఒకటి. హిందీలో కూడా ‘సామ్రాజ్య’ పేరిటే విడుదల చేశారు. మరి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఇదే సామ్రాజ్యం తారక్ ని వెతుక్కుంటూ రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

అన్నట్టు ఈ సామ్రాజ్యం సినిమా ఎవరిదో కూడా కాదు కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు వెట్రిమారన్ ఆలాగే హీరో శింబు కలయికలో అనౌన్స్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ అర్సన్ కి తెలుగు వెర్షన్ గా ప్రకటించారు. ఇక తారక్ వాయిస్ ఓవర్ లో రానున్న ప్రోమో ఈ ఆక్టోబర్ 17 శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాలకి రానుంది.

Exit mobile version