బాహుబలి భారీ యుద్ధం ఎపిసోడ్ కోసం కసరత్తులు చేస్తున్న టీం

baahubali
‘బాహుబలి’ సినిమా కోసం తెరకెక్కించనున్న ఓ భారీ యుద్ధం సీక్వెన్స్ ని డిసెంబర్ 3వ వారం నుంచి షూట్ చేయడానికి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి సిద్దమవుతున్నారు. ఈ భారీ సీక్వెన్స్ ని సుమారు 2000 మందితో షూట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సీక్వెన్స్ చేయడానికి సంబందించిన ప్రాక్టీస్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ప్రభాస్, రానా మరియు కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు ఈ ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సబు సైరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version