సినిమా పరిశ్రమలోకి మొదట డాన్సర్, కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టి ఆ తర్వాత నటుడిగా, ఆ ఆతర్వాత దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకుంటున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గత 25 ఏళ్ళుగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘రామయ్యా వస్తావయ్యా'(హిందీ) సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న ప్రభుదేవా ఓ ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో మీరు కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్.. ఈ మూడింటిలో మీకేది ఇష్టం అంటే ‘ కచ్చితంగా డాన్స్ అంటేనే ఇష్టం. కానీ ఇప్పటి డాన్సర్లని చూసినప్పుడు నేను 25 ఏళ్ళ ముందు ఇండస్ట్రీకి వచ్చి బతికిపోయాను. అప్పుడు ఒక్కన్నే కాబట్టి నాకు మాత్రమే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే టైటిల్ దక్కింది. ఇప్పుడైతే కష్టం ఎందుకంటే ఇప్పుడు వందమంది బెస్ట్ డాన్సర్స్ లో నేనూ ఒకడిగా ఉండేవాన్ని కాబట్టి ఆ బిరుదు ఆ వందమందికి ఇచ్చే వారు. ఇప్పుడు చాలామంది డాన్సర్స్ ఉన్నారని’ ప్రభుదేవా అన్నాడు.