తెలుగులో డబ్ అవుతున్న ప్రభుదేవా ABCD

తెలుగులో డబ్ అవుతున్న ప్రభుదేవా ABCD

Published on Jan 19, 2013 12:50 AM IST

ABCD
ప్రభు దేవా రాబోయే చిత్రం “ABCD – ఎనీబడీ కెన్ డాన్స్” తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రం భారతదేశంలో మొదటి 3D డాన్స్ చిత్రం కాబోతుంది. ఈ చిత్రంలో గణేష్ ఆచార్య మరియు కేకే మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించగా సిద్దార్థ్ రాయ్ కపూర్ మరియు రొన్ని స్క్రీవాలా సంయుక్తంగా యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ప్రభు దేవా ప్రధాన పాత్రలో ఎన్నో చిత్రాలు వచ్చినా డాన్స్ నేపధ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. “ప్రేమికుడు” చిత్రంలో ముక్కాలా ముక్కబుల పాటను రీమిక్ష్ చేసి ప్రోమోశానల్ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వచ్చే వారం విడుదల కానుంది. సచిన్ మరియు జిగర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు,తమిళ మరియు హిందీలలో విడుదల కానుంది.

తాజా వార్తలు